క్యాబిన్ లో ఇరుక్కుపోయి తీవ్రంగా గాయపడిన లోకోపైలెట్ ను కాపాడిన రైల్వే శాఖ!

  • కాచిగూడ రైల్వే స్టేషన్ లో ప్రమాదం
  • ఆగివున్న రైలును ఢీకొన్న ఎంఎంటీఎస్
  • క్యాబిన్ లో చిక్కుకుపోయిన ఎంఎంటీఎస్ డ్రైవర్
హైదరాబాద్ లోని కాచిగూడలో రెండు రైళ్లు ఢీకొన్న ఘటనలో ఓ లోకోపైలెట్ క్యాబిన్ లో ఇరుక్కుపోయి ఎనిమిది గంటల పాటు నరకయాతన అనుభవించాడు. అత్యంత ప్రయాసతో అతడిని రైల్వేశాఖ అధికారులు కాపాడారు. గ్యాస్ కట్టర్ల సాయంతో క్యాబిన్ ముందు భాగాన్ని కొద్ది కొద్దిగా తొలగిస్తూ ఆ డ్రైవర్ ను బయటికి తీసుకొచ్చారు.

కాచిగూడ రైల్వేస్టేషన్ లో ఆగివున్న హంద్రీ నీవా ఎక్స్ ప్రెస్ రైలును ఫలక్ నుమా నుంచి సికింద్రాబాద్ వెళుతున్న ఎంఎంటీఎస్ రైలు బలంగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో దాదాపు 30 మంది ప్రమాణికులు గాయపడ్డారు. ఎంఎంటీఎస్ క్యాబిన్ ముందు భాగం నుజ్జునుజ్జయిపోవడంతో లోకోపైలెట్ అందులోనే చిక్కుకుపోయాడు. బయటికి వచ్చే మార్గంలేక విలవిల్లాడిపోయాడు. తీవ్రంగా శ్రమించిన అధికారులు ఎట్టకేలకు అతడిని బయటికి తీసుకువచ్చి కేర్ ఆసుపత్రికి తరలించారు.
Go Back to Shorts
MMTS
Hyderabad
Kachiguda

More Telugu News