మ్యాచ్ ను మలుపు తిప్పిన శివం దూబే, చహర్ విజృంభణ... టి20 సిరీస్ భారత్ కైవసం
- మూడో టి20లో బంగ్లాదేశ్ పై టీమిండియా విజయం
- 3 వికెట్లతో సత్తా చాటిన దూబే
- చహర్ కు 6 వికెట్లు
భారీ లక్ష్యఛేదనకు దిగిన బంగ్లా జట్టును మీడియం పేసర్ దీపక్ చహర్ బంగ్లాను ఆరంభంలోనే దెబ్బతీశాడు. చహర్ దాటికి 12 పరుగులకే 2 వికెట్లు కోల్పోయినా, నయీం మెరుపుదాడితో బంగ్లా కోలుకుంది. నయీం 48 బంతుల్లో 10 ఫోర్లు, 2 సిక్సర్లతో 81 పరుగులు సాధించాడు. మొత్తమ్మీద పరుగుల వేటలో బంగ్లాదేశ్ 19.2 ఓవర్లలో 144 పరుగులకు ఆలౌటైంది. చివర్లో చహర్ వెంటవెంటనే రెండు వికెట్లు తీసి బంగ్లా ఇన్నింగ్స్ కు చరమగీతం పాడాడు. ఈ మ్యాచ్ లో చహర్ కు 6 వికెట్లు లభించాయి. ఈ విజయంతో మూడు మ్యాచ్ ల టి20 సిరీస్ 2-1తో భారత్ వశమైంది.