రగ్బీ ఆడే తిమింగలం... వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రగ్బీ ఆడే తిమింగలం... వైరల్ అవుతున్న వీడియో ఇదిగో!

  • ఆర్కిటిక్ ధ్రువంలో పర్యటించిన సౌతాఫ్రికా బోటు
  • గంట పాటు తిమింగలంతో రగ్బీ ఆట
  • ముచ్చటగా ఉందంటున్న నెటిజన్లు
టన్నుల బరువుండే భారీ కాయంతో, సముద్రంలో తిరుగుతూ కనిపించే తిమింగలాన్ని చూస్తేనే భయమేస్తుంది. కానీ, ఈ బెలూగా రకం తిమింగలం మాత్రం మనుషులతో కలిసి రగ్బీ ఆడుతోంది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. దక్షిణాఫ్రికాకు చెందిన ఓ బోటులో కొందరు ఆర్కిటిక్ ధ్రువంలో ప్రయాణిస్తున్న వేళ, వారికీ తిమింగలం కనిపించింది. అదే బోటులో ఉన్న జెమిని క్రాఫ్ట్ అనే వ్యక్తి, తన వద్ద ఉన్న రగ్బీ బాల్ ను దానికి అందిస్తుంటే, అది తిరిగి దాన్ని తెచ్చిన క్రాఫ్ట్ కు అందిస్తోంది. దాదాపు గంట సమయం పాటు తిమింగలంతో కలిసి వారు రగ్బీ ఆడారు. ఈ వీడియోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేయగా, వేలకొద్దీ షేర్ లు, లక్షల కొద్దీ లైక్ లూ వచ్చాయి. ఈ వీడియో ఎంతో ముచ్చటగా ఉందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. దాన్ని మీరూ చూడండి.
Sea Whale
Rugby
Architec

More Telugu News