Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెవిలో బొద్దింకల కాపురం.... చైనాలో విచిత్రం!

  • చెవినొప్పితో బాధపడిన వ్యక్తి
  • చెవిలో ఏదో ఉన్నట్టు గుర్తించిన కుటుంబ సభ్యులు
  • బొద్దింకలను వెలికితీసిన వైద్యులు
చైనాలో ఓ వ్యక్తి చెవిలో బొద్దింకలు కాపురం పెట్టడం వైద్యులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చైనాకు చెందిన ఎల్వీ అనే 24 ఏళ్ల యువకుడు ఇటీవల చెవి నొప్పితో బాధపడుతూ కుటుంబ సభ్యులను లైట్ వేసి చూడమన్నాడు. టార్చ్ లైట్ వెలుగులో అతడి చెవిలో ఏదో కదులుతున్నట్టు గుర్తించారు. దాంతో ఆ వ్యక్తిని సాన్హే ఆసుపత్రికి తీసుకువెళ్లగా, వైద్యులు అతడి చెవిని నిశితంగా పరిశీలించి, అందులో బొద్దింకలు ప్రవేశించాయని తెలుసుకున్నారు. చెవి లోపలి భాగం నుంచి పెద్ద బొద్దింకతో పాటు 10 చిన్న బొద్దింకలను వెలికితీశారు.

బొద్దింకల కారణంగా ఆ వ్యక్తి చెవికి ఇన్ఫెక్షన్ సోకిందని డాక్టర్ ఝాంగ్ యిజిన్ వెల్లడించారు. అపరిశుభ్రత వల్లే ఇలాంటి పరిస్థితి ఏర్పడి ఉంటుందని వారు ఆ వ్యక్తిని మందలించారు. ఎల్వీ తినగా మిగిలిన ఆహారాన్ని తన బెడ్ వద్దే పడేస్తుండడంతో బొద్దింకలు అక్కడికి ఎక్కువగా వస్తుండేవని, ఆ విధంగానే అతడి చెవిలో ప్రవేశించి గూడు కట్టుకుని ఉంటాయని భావిస్తున్నారు.
China
Cockroach
Man
Ear

More Telugu News