తహసీల్దారు విజయారెడ్డిని కాపాడబోయిన డ్రైవర్ గురునాథం కూడా మృతి!
- తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లిన గురునాథం
- 80 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చికిత్స
- పరిస్థితి విషమించి మృతి
నిన్న సురేశ్, తహసీల్దారు గదిలోకి వెళ్లి, తలుపులు బిగించి, ఆమెకు నిప్పంటించిన వేళ, తొలుత తలుపులను పగులగొట్టి, లోపలికి దూసుకెళ్లింది గురునాథమే. ఈ ఘటనలో అతనికి 80 శాతం మేరకు గాయాలు కాగా, అపోలో ఆసుపత్రికి తరలించి, చికిత్సను అందించారు. గాయాల తీవ్రత అధికంగా ఉండటంతోనే ఆయన మరణించాడని వైద్య వర్గాలు వెల్లడించాయి.