రాజమౌళికి, కేఏ పాల్ కు ముడివేసిన వర్మ... నన్ను ఇన్వాల్వ్ చేయవద్దంటూ రాజమౌళి ట్వీట్
- ట్విట్టర్ లో వర్మ కలకలం
- కేఏ పాల్ తో రాజమౌళి బాహుబలి-3 తీస్తున్నాడంటూ వ్యాఖ్యలు
- వెంటనే స్పందించిన రాజమౌళి
దీనికి దర్శకుడు రాజమౌళి స్పందిస్తూ, "నన్ను ఇందులోకి లాగకండి రాజు గారూ" అంటూ బదులిచ్చాడు. వెంటనే వర్మ అందుకుని, "సార్ నేను మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కాదు, ట్రంప్ టవర్స్ లో మీరిద్దరూ లంచ్ చేశారట, బాహుబలి-3కి మీరు కేఏ పాల్ తో ఒప్పందం కుదుర్చుకున్నారట. కేఏ పాల్ మీద ఒట్టు! తనే నాకు ఫోన్ చేసి చెప్పాడు" అంటూ రిప్లయ్ ఇచ్చారు.