ఇమ్రాన్ ఖాన్ కు షాక్.. కశ్మీర్ ను సమస్యగా చూస్తున్న పాకిస్థాన్ ప్రజలు 8 శాతం మందే!
- 'గాలప్ ఇంటర్నేషనల్' సంస్థ నిర్వహించిన సర్వేలో బయటపడ్డ వాస్తవాలు
- ఆర్థిక సంక్షోభమే పెద్ద సమస్య అన్న 53 శాతం మంది ప్రజలు
- ఇమ్రాన్ ప్రభుత్వానికి ప్రజల మద్దతు 8 శాతం మాత్రమే
దేశ ఆర్థిక సంక్షోభమే పెను సమస్య అని 53 శాతం మంది పాక్ ప్రజలు తెలిపారు. రాజకీయ అస్థిరతపై కూడా వారు ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం 8 శాతం మంది ప్రజలు మాత్రమే కశ్మీర్ ను ఒక సమస్యగా చూస్తుండటం గమనార్హం. మరోవైపు, కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై లేవనెత్తుతూ రాద్ధాంతం చేస్తున్న ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి కేవలం 8 శాతం మంది మాత్రమే మద్దతు పలికారు. ఇది ఇమ్రాన్ కు షాకిచ్చే అంశమే.