తమిళ హాస్యనటుడు సెంథిల్ కుమార్‌ను మోసం చేసిన మేనేజర్
- సెంథిల్ కుమార్ ఫ్లాట్‌ను రూ. 2.60 లక్షల అద్దెకు తీసుకున్న ప్రొడక్షన్ మేనేజర్
- ఆరు నెలలుగా చెల్లించని అద్దె
- తన ఫ్లాట్‌గా చెప్పుకుని మరొకరికి అద్దెకిచ్చిన సగాయరాజ్
అనుమానం వచ్చిన సెంథిల్ కుమార్ నేరుగా తన ఫ్లాట్‌కు వెళ్లగా అక్కడ వేరే వ్యక్తులు ఉన్నారు. వారిని ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సగాయరాజ్ ఈ అపార్ట్‌మెంట్‌ను తమకు లీజుకు ఇచ్చాడని, మరికొందరికి అద్దెకు ఇచ్చాడని చెప్పడంతో సెంథిల్ కుమార్ విస్తుపోయాడు. సగాయరాజ్ తనను మోసం చేశాడంటూ విరుగంబాక్కమ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.