'నాకు బతకాలని లేదు.. ఈ లోకంలో ఉండలేకపోతున్నా' అంటూ లేఖ రాసి, యువతి ఆత్మహత్య
- కర్నూలు, సీతారాంనగర్‌లో ఘటన
- కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీఈఓగా పని చేస్తోన్న యువతి
- తన అక్క, అన్న, చెల్లెలికి తన మృతదేహాన్ని చూపొద్దని లేఖ
ఆమె తల్లిదండ్రులు వీరభద్రుడు, లక్ష్మీదేవి పాణ్యంలో ఉంటారు. తాను ఉంటోన్న అద్దె ఇంట్లో ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. గదిలో ఆమె రాసిన సూసైడ్ నోట్‌ను పోలీసులు గుర్తించారు. అమ్మను బాగా చూసుకోవాలని, తన అక్కను బావ బాగా చూసుకోవడం లేదని ఆమె ఆ లేఖలో తన తండ్రికి తెలిపింది. తాను చనిపోయాక తన మృతదేహాన్ని తన అక్క, అన్న, చెల్లెలికి చూపొద్దని, దయచేసి తన కోరిక తీర్చాలని ఆమె అందులో పేర్కొంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.