కోడిపందాలపై పోలీసుల దాడి... పారిపోతూ ఇద్దరి మృతి!
- ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు
- పారిపోతూ కాలువలో పడిన ముగ్గురు
- ఇద్దరి మృతదేహాలు వెలికితీత
ఈ ఘటన ప్రకాశం జిల్లాలో జరిగింది. చీరాల మండలం విజయనగర్ కాలనీ శివార్లలో కోడి పందాల స్థావరాలున్నాయని తెలుసుకున్న పోలీసులు దాడులు చేశారు. పోలీసులను చూసిన నిర్వాహకుల్లో ముగ్గురు పారిపోయే క్రమంలో సమీపంలోని కాలువలో పడి గల్లంతయ్యారు. వీరిలో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. వారిని మధు, శ్రీనుగా గుర్తించారు. గల్లంతైన మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాఫ్తు చేపట్టారు.