మొండికేసిన శివసేన... మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జాప్యం!
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మొండికేసిన శివసేన... మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు జాప్యం!

  • సీట్లు తగ్గినా పీఠాన్ని చేరుకున్న కూటమి
  • ఆదిత్య ఠాక్రేకు సీఎం చాన్స్ కావాలంటున్న శివసేన
  • అంగీకరించేది లేదంటున్న బీజేపీ
2014తో పోలిస్తే, సీట్లు తగ్గినప్పటికీ, మహారాష్ట్రలో బీజేపీ - శివసేన కూటమి అధికారాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మెజారిటీకి తగినట్లుగా సీట్లను సాధించినప్పటికీ, సీఎం పీఠాన్ని పంచుకునే విషయమై ప్రతిష్ఠంభన ఏర్పడటంతో, ప్రభుత్వ ఏర్పాటు ఆలస్యం అవుతోంది. రెండు పార్టీలూ రెండున్నరేళ్ల చొప్పున సీఎం పీఠాన్ని పంచుకోవాల్సిందేనని, తమ పార్టీ యువనేత ఆదిత్య ఠాక్రేకు తొలి రెండున్నరేళ్లూ సీఎంగా చాన్స్ ఇవ్వాలని శివసేన పట్టుబడుతోంది. ఈ మేరకు బీజేపీ నుంచి లిఖిత పూర్వక హామీని డిమాండ్ చేస్తోంది. అలా చేస్తేనే తమ మద్దతు ఉంటుందని ఆ పార్టీ అధిష్ఠానం బీజేపీకి తేల్చి చెప్పింది. అయితే శివసేన డిమాండ్లను అంగీకరించేందుకు బీజేపీ ఏ మాత్రమూ సిద్ధంగా లేదు.

ఇదే సమయంలో శివసేన నేతలు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో చర్చలు జరుపుతున్నారని, ఈ రెండు పార్టీల నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడే అవకాశాలు ఉన్నాయన్న వార్తలు వచ్చాయి. అయితే, ఇవన్నీ అవాస్తవాలేనని, శివసేనకు మద్దతిచ్చే ఆలోచనేదీ తమ వద్ద లేదని ఆ పార్టీ చీఫ్ శరద్ పవార్ స్పష్టం చేశారు. మరోవైపు తమతో కలిసి పోటీ చేసిన ఎన్సీపీ మెరుగైన ప్రదర్శన కనబరచడంతో, అధికార పీఠాన్ని పొందేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించుకోవాలని కాంగ్రెస్ అధిష్ఠానం పవార్ కు సూచించినట్టు సమాచారం. అవసరమైతే తాము పక్కకు తప్పుకుంటామని ఆ పార్టీ పెద్దలు స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.
Maharashtra
BJP
Sivasena

More Telugu News