సింగరేణి కార్మికులకు బంపర్ బొనాంజా.. దీపావళికి కూడా అధిక బోనస్

  • నిన్న సాయంత్రం దీపావళి బోనస్ పంపిణీ
  • దసరా సమయంలో లాభాల్లో పంపకం
  • కార్మికుల ఖాతాల్లో జమ చేసిన యాజమాన్యం
సింగరేణి కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం బంపర్ బొనాంజా ప్రకటించింది. దీపావళి వేళ కార్మికులు భారీ బోనస్ అందుకున్నారు. సింగరేణి చరిత్రలో ఇదే అత్యధిక బోనస్. దీపావళి బోనస్ కింద రూ. 258 కోట్లు విడుదల చేసిన సింగరేణి యాజమాన్యం.. నిన్న కార్మికులు, ఉద్యోగులు ఒక్కొక్కరికి రూ.64,700 చొప్పున బోనస్ పంపిణీ చేసింది. ఈ మొత్తాన్ని వారి ఖాతాల్లో జమచేసింది.

దసరా పండుగకు ముందు సింగరేణి యాజమాన్యం రూ.494 కోట్ల లాభాలను కార్మికులకు బోనస్‌గా పంపిణీ చేసింది. తాజాగా పంపిణీ చేసిన బోనస్‌తో కలుపుకుంటే ఒక్కో కార్మికుడు ఏకంగా లక్ష రూపాయల బోనస్ అందుకున్నట్టు. దేశంలో ఓ ప్రభుత్వ రంగ సంస్థ కార్మికులకు చెల్లించిన అత్యధిక బోనస్ ఇదే కావడం గమనార్హం.
Go Back to Shorts
singareni
Telangana
Deepavali
bonus

More Telugu News