హర్యానా ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయిన టిక్ టాక్ తార
- బీజేపీ తరఫున పోటీ చేసిన సోనాలీ ఫోగాట్
- ఆదంపూర్ టికెట్ ఇచ్చిన బీజేపీ
- కులదీప్ బిష్ణోయ్ చేతిలో ఓటమి
ఆదంపూర్ నియోజకవర్గం బిష్ణోయ్ కుటుంబానికి కంచుకోట వంటిది. అర్ధ శతాబ్ద కాలంగా అక్కడ బిష్ణోయ్ కుటుంబీకులదే పైచేయిగా కొనసాగుతోంది. ఎన్నికల ముందు హర్యానాలో బీజేపీదే హవా అని ప్రచారం జరిగింది. ఈ హవాలో తాను కూడా విజయం సాధిస్తానని సోనాలీ ఫోగాట్ భావించింది. కానీ ఆదంపూర్ ఓటర్లు మాత్రం బిష్ణోయ్ కుటుంబం వైపే నిలిచారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కులదీప్ బిష్ణోయ్ కి 64 వేల ఓట్లు రాగా, సోనాలీకి 34 వేల ఓట్లు పోలయ్యాయి.