రతన్ టాటాకు జన్మ జన్మలకు రుణ పడి ఉంటాను: కేశినేని నాని
- విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు వైద్య సేవా కార్యక్రమాలు
- అక్కడి గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం
- 265 గ్రామాలకు చెందిన 10 లక్షల మందికి సేవలందిస్తున్నారన్న కేశినేని
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు స్వస్థ కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై స్పందించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని.. ఆ సంస్థ అధినేత రతన్ టాటాకు కృతజ్ఞతలు తెలిపారు. 'రతన్ టాటా గారు టాటా ట్రస్టు ద్వారా విజయవాడ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఉన్న 265 గ్రామాలకు చెందిన 10 లక్షల మంది ప్రజలకు చేస్తోన్న సేవలు అమోఘం. నేను ఆయనకి జన్మ జన్మలకు రుణ పడి వుంటాను' అని ట్వీట్ చేశారు.
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో టాటా ట్రస్టు ద్వారా లక్షలాది మందికి ఉచితంగా వైద్యం అందుతోందని ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని కేశినేని నాని పోస్ట్ చేశారు. కాగా, కేశినేని నాని చొరవతో మూడేళ్ల క్రితం ఇక్కడ బీమా కార్డులను జారీ చేశారు. రెండేళ్ల క్రితం టెలీమెడిసిన్ సెంటర్లు ప్రారంభమయ్యాయి. ఆ నియోజక వర్గ పరిధిలోని ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ఉచిత వైద్య శిబిరాలు అందుబాటులో ఉంటున్నాయి. దీంతో అక్కడి గ్రామాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతోంది.