దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుంది విజయసాయిరెడ్డీ: బుద్ధా వెంకన్న చురక
- దరిద్రానికి బ్రాండ్ అంబాసడర్ మీ తుగ్లక్ ముఖ్యమంత్రి
- గోదావరిలో 56 మంది అమాయకులను మింగేశారు
- డెంగ్యూ, మలేరియాతో ప్రజలు అల్లాడుతున్నారు
'దరిద్రానికి ప్యాంటు, షర్టు వేస్తే మీలాగే ఉంటుంది విజయసాయిరెడ్డీ' అంటూ వెంకన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దరిద్రానికి బ్రాండ్ అంబాసడర్ మీ తుగ్లక్ ముఖ్యమంత్రి అని కొత్తగా చెప్పక్కర్లేదంటూ విమర్శించారు. మీరు అడుగుపెట్టాక రాష్ట్రానికి అన్నీ అపశకునాలేగా వీసారెడ్డీ అంటూ ఎద్దేవా చేశారు. గోదావరిలో బోటును ముంచి 56 మంది అమాయకులను మింగేశారని... రాష్ట్రంలో 256 మంది రైతుల్ని మింగేశారని అన్నారు.