'ఎగిరి' వచ్చిన మృత్యువు!
- విజయనగరం జిల్లాలో ఘటన
- లారీ టైర్ పేలి గాల్లో దూసుకు వచ్చిన ఇనుప చట్రం
- హెల్మెట్ పగిలి, తలకు తీవ్ర గాయాలతో వ్యక్తి మృతి
సరిగ్గా అచ్చిబాబు మోటార్ సైకిల్, లారీని దాటుతున్న సమయంలో లారీ టైరు ఒక్కసారిగా పేలింది. టైరుకు అమర్చివున్న ఇనుపచట్రం గాల్లో ఎగిరి, దూసుకొచ్చి, అచ్చి బాబు తలకు బలంగా తాకింది. దాని ధాటికి హెల్మెట్ ముక్కలు కాగా, తలకు తీవ్రగాయం అయింది. ఈ ప్రమాదంలో అచ్చిబాబు అక్కడికక్కడే మరణించగా, విషయం తెలుసుకున్న పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తూ, అతని ప్రమేయం ఏమాత్రం లేకపోయినా మృత్యువు తరుముకొచ్చిందని చర్చించుకున్నారు.