ప్రభు ఇచ్చిన 'విందు అద్భుతం' అంటున్న కమల్!
- ప్రత్యేక విందుతో తమిళ నటుడు ప్రభు సత్కారం
- విందు విశేషాలను అభిమానులతో పంచుకున్న కమల్
- త్వరలో భారతీయుడు-2గా ప్రేక్షకుల్లోకి
‘నటుడు ప్రభుతో గడపడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. విందు అద్భుతం’ అని కమల్ ప్రశంసించారు. ఇక కమల్ ప్రస్తుతం భారతీయుడు చిత్రానికి సీక్వెల్ గా వస్తోన్న ‘భారతీయుడు-2’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాకోసం 23 సంవత్సరాల తర్వాత శంకర్ తో కలిసి కమల్ మళ్లీ పనిచేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనిల్ కపూర్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఇంకా ఈ చిత్రంలో సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, తదితరులు నటిస్తున్నారు.