'దేవదాసు'లో షావుకారు జానకి చేయవలసిందట
- 'షావుకారు' జానకిగారికి గుండె నిబ్బరం ఎక్కువ
- అవకాశాలు చేజారినా ఆమె నిరాశపడలేదు
- పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నారన్న ఈశ్వర్
'దేవదాసు' సినిమాలో మొదటిగా జానకిగారికే అవకాశం వచ్చింది. చివరి నిమిషంలో అది సావిత్రిగారి చేతికి వెళ్లింది. అయినా ఆమె ఎంత మాత్రం బాధపడలేదు. తెలుగులో 'రోజులు మారాయి' చేసిన జానకి గారు, తమిళంలోను ఆ పాత్రను తనే చేయాలనుకున్నారుగానీ అది అంజలీదేవిగారికి వెళ్లింది. ఇక తమిళంలో జానకిగారు చేసిన ఒక సినిమా తెలుగులో 'కలెక్టర్ జానకి' పేరుతో రీమేక్ చేస్తుంటే, తనకే ఆ అవకాశం వస్తుందని జానకిగారు భావించగా అది జమునగారికి వెళ్లింది. ఇలాంటి సంఘటనలు వరుసగా ఎదురవుతున్నప్పటికీ ఆమె తట్టుకుని నిలబడటం విశేషం' అని చెప్పుకొచ్చారు.