Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ప్రియురాలిని పెళ్లాడిన రఫేల్ నాదల్!

  • 14 ఏళ్లుగా షిస్కాతో పరిచయం
  • స్పెయిల్ లో వైభవంగా వివాహం
  • నూతన జంటకు స్పెయిన్ రాజు శుభాకాంక్షలు
స్పెయిన్ బుల్, పరిచయం అక్కర్లేని టెన్నిస్ దిగ్గజం రఫేల్ నాదల్ వివాహం చేసుకున్నాడు. తాను గత 14 ఏళ్లుగా డేటింగ్ చేస్తున్న షిస్కా పెరెల్లోను నాదల్ పెళ్లి చేసుకున్నాడు. స్పెయిన్ లోని దీవుల్లో అత్యంత అందమైనదిగా చెప్పుకునే మలోర్కాలో వీరిద్దరి వివాహం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పెళ్లికి స్పెయిన్ రాజు జువాన్ కార్లోస్ ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులకు శుభాభినందనలు తెలిపారు. పెళ్లికి దాదాపు 350 మందికి పైగా సన్నిహితులు హాజరైనట్టు తెలుస్తోంది. నాదల్ సోదరి మారిబెల్ కు షిస్కా చిన్ననాటి స్నేహితురాలు. ఓ వేడుకలో ఆమెను కలిసిన నాదల్, తమ పరిచయాన్ని స్నేహంగా, ప్రేమగా మార్చుకున్నాడు. కాగా, వీరిద్దరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు బయటకు రాలేదు.
Nadal
Shiska
Marriage
Dating
Lover
Spain

More Telugu News