నల్లజాతీయులను గాంధీ అవమానించారట.. బ్రిటన్‌లో గాంధీ విగ్రహావిష్కరణకు అడ్డంకులు
- వచ్చే నెలలో ఆవిష్కరణకు సిద్ధమైన గాంధీ విగ్రహం
- నల్లజాతీయులను గాంధీ అవమానించారంటూ విద్యార్థుల లేఖ
- విగ్రహావిష్కరణకు అనుమతులపై సందిగ్ధం
అఫ్రికా నల్లజాతీయులను గాంధీ అవమానించారంటూ 2015లో మాంచెస్టర్ యూనివర్సిటీకి చెందిన ఇద్దరు ప్రొఫెసర్లు రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఇప్పుడిదే విషయాన్ని హైలెట్ చేస్తూ విద్యార్థులు లేఖ రాశారు. ఆయన విగ్రహం ఆవిష్కరించడం అంటే మాంచెస్టర్‌లోని నల్లజాతీయులను అవమానించడమే అవుతుందని వారు తమ లేఖలో పేర్కొన్నారు. కాగా, నల్లజాతీయుల హక్కుల కోసం పోరాడిన గాంధీని ఇప్పుడు అదే నల్లజాతీయులు వ్యతిరేకిస్తుండడం గమనార్హం.