Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సిగరెట్ తేవడానికి నిరాకరించిన స్నేహితుడు.. కత్తితో పొడిచిన యువకుడు

  • సిగరెట్ విషయంలో ఇద్దరి మధ్య ఘర్షణ
  • ఆగ్రహం పట్టలేక కత్తితో దాడి
  • జనం పోగవడంతో నిందితుడి పరారీ
సమీపంలోని పాన్‌షాప్‌కు వెళ్లి సిగరెట్ తీసుకురమ్మంటే తేలేదని స్నేహితుడిపైనే కత్తితో దాడికి దిగాడో ప్రబుద్ధుడు. హైదరాబాద్‌లోని బండ్లగూడలో జరిగిందీ ఘటన. చాంద్రాయణగుట్ట పోలీసుల కథనం ప్రకారం.. రాజీవ్‌గాంధీనగర్‌కు చెందిన మహ్మద్ సమీర్ (34) కుక్‌గా పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి స్నేహితుడు సలీంతో కలిసి చాంద్రాయణగుట్ట చౌరస్తా వద్దకు చేరుకున్నాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత పాన్‌షాప్‌కు వెళ్లి సిగరెట్ తీసుకురావాల్సిందిగా సమీర్‌ను సలీం కోరాడు. అందుకు సమీర్ నిరాకరించాడు.  

దీంతో ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. అది మరింత పెద్దగా మారడంతో సలీం ఆగ్రహంతో ఊగిపోతూ కత్తితో సమీర్‌పై దాడిచేశాడు. భయపడిన సమీర్ అక్కడి నుంచి పరుగులు తీశాడు. ఏం జరుగుతుందోనని జనం పోగవడంతో సలీం అక్కడి నుంచి పరారయ్యాడు. తీవ్ర గాయాలపాలైన సమీర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న సలీం కోసం గాలిస్తున్నారు.
Hyderabad
friends
Crime News

More Telugu News