'రాజుగారి గది 3' తొలిరోజు షేర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'రాజుగారి గది 3' తొలిరోజు షేర్

  • నిన్న విడుదలైన 'రాజుగారి గది 3'
  • రెండేళ్ల గ్యాప్ తరువాత చేసిన అవికా 
  • అశ్విన్ పై ఓంకార్ ఆశలు
ఓంకార్ దర్శకత్వంలో అశ్విన్ బాబు హీరోగా రూపొందిన 'రాజుగారి గది 3' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అవికా గోర్ కథానాయికగా నటించిన ఈ హారర్ కామెడీ, తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజున 1.25 కోట్ల షేర్ ను రాబట్టింది.

తొలి రోజున నైజామ్ లో 42 లక్షలు .. సీడెడ్ లో 24 లక్షలు .. వైజాగ్ లో 16 లక్షలు .. గుంటూరులో 14 లక్షలు .. తూర్పుగోదావరిలో 10 లక్షలు .. కృష్ణా జిల్లాలో 9 లక్షలు పశ్చిమ గోదావరిలో 6 లక్షలు .. నెల్లూరులో 4 లక్షలను వసూలు చేసింది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత అవికా ఈ సినిమా చేయడం విశేషం. ఇక ఈ సినిమాతో అశ్విన్ హీరోగా నిలదొక్కుకుంటాడనే ఆశాభావాన్ని ఓంకార్ వ్యక్తం చేస్తున్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.
Ashwin
Avika

More Telugu News