సర్ఫరాజ్ పై వేటు... పాక్ కెప్టెన్ గా అజహర్ అలీ
- టీ 20 జట్టు కెప్టెన్ గా బాబర్ ఆజమ్
- ఇటీవలి వైఫల్యాలే సర్ఫరాజ్ పై వేటుకు కారణం
- 2019-20 టెస్ట్ చాంపియన్ షిప్ వరకు అలీయే కెప్టెన్
సర్ఫరాజ్ మంచి ఆటగాడని, సారథ్య బాధ్యతలు చక్కగా నిర్వహించాడని, అతన్ని తొలగించే నిర్ణయం మింగుడు పడనప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో కెప్టెన్సీ మార్పుకు మొగ్గు చూపామని పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ ఎహసాన్ మణి తెలిపారు. సర్ఫరాజ్ కెప్టెన్ గా పగ్గాలు చేపట్టినప్పుడు జట్టు పరిస్థితి అంతంత మాత్రమేనని, తన హయాంలో జట్టును విజయ పథంలో నడిపినప్పటికీ ఇటీవలి అపజయాలు అతనిపై విమర్శలు వచ్చేలా చేశాయని మణి చెప్పారు. అయితే, సర్ఫరాజ్ ఉద్వాసనకు కోచ్, చీఫ్ సెలెక్టర్ మిస్బావుల్ హక్ కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.