మధ్యప్రదేశ్‌లో రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్న మాజీ సీఎం.. హేమమాలిని బుగ్గల్లా మారుస్తామన్న మంత్రి

మధ్యప్రదేశ్‌లోని రోడ్లపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలోని రోడ్లు దరిద్రంగా ఉన్నాయంటూ మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పీసీ శర్మ కౌంటర్ ఇస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే వాటిని హేమమాలిని బుగ్గల్లా మారుస్తామని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్‌లోని రోడ్ల పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఫలితంగా వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారని కమల్‌నాథ్ ప్రభుత్వంపై శివరాజ్ సింగ్ తీవ్ర విమర్శలు చేశారు.

శివరాజ్ విమర్శలకు మంత్రి పీసీ శర్మ స్పందించారు. ఇప్పుడున్న రోడ్లు బాగానే ఉన్నాయని, భారీ వర్షాలు కురిస్తే ఎక్కడైనా ఇదే పరిస్థితి ఉంటుందని బదులిచ్చారు. వాషింగ్టన్‌లోని రోడ్లతో పోటీపడేలా నిర్మిస్తామన్న మంత్రి.. ప్రస్తుతం రోడ్లు  బీజేపీ నేత కైలాశ్‌ విజయవర్గీయ బుగ్గల్లా ఉన్నాయని, ముఖ్యమంత్రి ఆదేశిస్తే 15 రోజుల్లోనే వాటికి మరమ్మతులు చేసి బీజేపీ ఎంపీ హేమమాలిని బుగ్గల్లా మార్చేస్తామని అన్నారు.  
Go Back to Shorts
BJP
shivraj singh chouhan
hema malini
Madhya Pradesh

More Telugu News