kphb: సినిమా ప్రదర్శన పది నిమిషాలు ఆలస్యమైందట.. కేపీహెచ్‌బీలోని థియేటర్ పై కేసు పెట్టిన ప్రేక్షకుడు!

నిర్ణీత సమయానికి పది నిమిషాలు ఆలస్యంగా సినిమా ప్రదర్శన ప్రారంభం కావడంతో అసహనానికి గురైన ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్, కేపీహెచ్‌బీ పోలీసుల కథనం ప్రకారం.. ఈ నెల 8న స్థానిక మంజీరా మాల్‌లోని మూడో అంతస్తులో ఉన్న సినీ పోలిస్‌లో 'చాణక్య' సినిమాను ప్రదర్శిస్తున్నారు.

ఇక సినిమా ప్రదర్శన 4:40 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా, పది నిమిషాలు ఆలస్యంగా ప్రదర్శించారు. ఆ పది నిమిషాలు వాణిజ్య ప్రకటనలు వేసి విసుగు తెప్పించడంతోపాటు, తన సమయాన్ని వృథా చేశారని, నియమ నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపిస్తూ ఓ ప్రేక్షకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదుపై మంగళవారం కోర్టు నుంచి అనుమతి వచ్చింది. దీంతో తాజాగా కేసు నమోదు చేసినట్టు సీఐ లక్ష్మీనారాయణ తెలిపారు.
kphb
Hyderabad
cine polis
police case

More Telugu News