Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రవిప్రకాశ్ కు చెందిన వెబ్ చానళ్లపై పోలీసులకు ఫిర్యాదు చేసిన న్యాయవాది

  • రవిప్రకాశ్ మీడియా హౌస్ పై న్యాయవాది రామారావు ఫిర్యాదు
  • వెబ్ చానళ్లలో అసత్య ప్రచారం చేస్తున్నారని వెల్లడి
  • పరువుకు భంగం కలిగిస్తున్నారని వ్యాఖ్యలు
టీవీ9 మాజీ సీఈఓ రవిప్రకాశ్ కు చెందిన కొన్ని వెబ్ చానళ్లు తనపై అసత్య ప్రచారం చేస్తున్నాయంటూ హైకోర్టు న్యాయవాది రామారావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవిప్రకాశ్ అక్రమాలకు పాల్పడ్డాడంటూ సుప్రీంకోర్టు సీజేఐకి ఫిర్యాదు చేసింది విజయసాయిరెడ్డి అయితే, తాను ఫిర్యాదు చేసినట్టుగా రవిప్రకాశ్ కు చెందిన వెబ్ చానళ్లు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని రామారావు ఆరోపించారు. ఈ మేరకు రవిప్రకాశ్ మీడియా హౌస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పై ఆయన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను ఎలాంటి ఫిర్యాదు చేయకపోయినా, చేసినట్టుగా ఆ వెబ్ చానళ్లు కథనాలు ప్రసారం చేస్తూ తన పరువుకు భంగం కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.
TV9
Raviprakash

More Telugu News