హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరిన తమిళిసై.. మోదీ, అమిత్ షాతో భేటీకానున్న గవర్నర్
- ఆర్టీసీ సమ్మెను నిశితంగా గమనిస్తున్న కేంద్ర ప్రభుత్వం
- ఢిల్లీకి రావాలంటూ తమిళిసైకి పిలుపు
- మోదీ, అమిత్ షాలకు పరిస్థితిని వివరించనున్న గవర్నర్
మరోవైపు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను కేంద్ర ప్రభుత్వం కూడా నిశితంగా గమనిస్తోంది. సమ్మెపై గవర్నర్ ను కేంద్ర ప్రభుత్వం ఆరా తీసింది. అంతేకాదు, ఢిల్లీకి రావాలంటూ ఆదేశించింది. ఆర్టీసీ సమ్మెపై నివేదికను కోరింది. కేంద్ర ప్రభుత్వ పిలుపు మేరకు ఆమె హుటాహుటిన ఢిల్లీకి బయల్దేరారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోదీతో గవర్నర్ భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలవనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో చోటు చేసుకున్న పరిణామాలను వారికి వివరించనున్నారు.