మ్యాగీ చేయబోయిన ఏడేళ్ల చిన్నారి... గ్యాస్ సిలిండర్ పేలి మృతి!
- కర్ణాటకలోని తుముకూరులో ఘటన
- తల్లి అనుమతితో వంటగదిలోకి వెళ్లిన బిడ్డ
- అప్పటికే గ్యాస్ లీక్ కాగా ప్రమాదం
అయితే, అప్పటికే గ్యాస్ లీక్ అవుతూ ఉన్న విషయాన్ని ఎవ్వరూ గమనించలేదు. లైటర్ తో స్టవ్ ను వెలిగించబోగా, మంటలు ఎగిశాయి. ఈ క్రమంలో నోయల్ కు తీవ్రగాయాలు అయ్యాయి. అక్కడే ఉన్న తల్లిదండ్రులు, వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు సైతం చికిత్సను వెంటనే ప్రారంభించి, బిడ్డను కాపాడేందుకు ప్రయత్నించారు. అయితే, గాయాల తీవ్రత అధికంగా ఉండటంతో, వైద్యులు చేసిన చికిత్స అతని ప్రాణాలను నిలపలేకపోయింది. విషయం తెలుసుకున్న తుముకూరు పోలీసులు, కేసు నమోదు చేసి, వివరాలు సేకరించారు. కన్నబిడ్డ మృతితో ఆ ఇంట్లో తీవ్ర విషాదం అలముకుంది.