చిరంజీవి గారు, మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను మాకు పంచుతూ ఉండాలి: జగన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చిరంజీవి గారు, మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను మాకు పంచుతూ ఉండాలి: జగన్

  • జగన్ నివాసానికి సతీమణితో కలసి వెళ్లిన చిరంజీవి
  • ఆత్మీయ స్వాగతం పలికిన జగన్ దంపతులు
  • 'సైరా'తో ఆత్మీయ సమావేశం జరిగిందన్న జగన్
ఏపీ ముఖ్యమంత్రి జగన్ నివాసానికి మెగాస్టార్ చిరంజీవి వెళ్లారు. తన భార్య సురేఖతో కలసి వచ్చిన చిరంజీవికి జగన్ దంపతులు ఆత్మీయంగా స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు పలు విషయాలపై మాట్లాడుకుని, విందు చేశారు. ఈ సందర్భంగా తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా జగన్ పంచుకున్నారు. 'సైరా'తో చాలా ఆత్మీయ సమావేశం జరిగిందని చెప్పారు. 'చిరంజీవి గారు మీరు ఇలాగే ఎన్నో జ్ఞాపకాలను, నవ్వులను మాకు పంచుతూ ఉండాలి' అంటూ ఆకాంక్షించారు.
Chiranjeevi
Jagan
YSRCP
Tollywood
Meeting

More Telugu News