చిరంజీవిపై పెట్టిన ఆ చెత్త పోస్టింగ్ లు నావి కావు: స్పష్టం చేసిన వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి

  • చిరంజీవిపై చెవిరెడ్డి ఫ్యాన్స్ పేరిట వ్యతిరేక ప్రచారం
  • తనకు అభిమాన సంఘాలు లేవన్న చెవిరెడ్డి
  • ట్విట్టర్, ఫేస్ బుక్ ఖాతాలు లేవని స్పష్టీకరణ
ప్రముఖ నటుడు చిరంజీవితో తనకు ఏ విధమైన విభేదాలూ లేవని చంద్రగిరి ఎమ్మెల్యే, వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో తన ప్యాన్స్ గా చెప్పుకుంటున్న కొందరు చిరంజీవిపై చేస్తున్న తప్పుడు ప్రచారం వెనుక తనకు ఎటువంటి సంబంధాలూ లేవని ఆయన అన్నారు. తిరుపతిలో ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, సామాజిక మాధ్యమాలైన ట్విట్టర్, ఫేస్ బుక్ లో తనకు ఎటువంటి ఖాతాలూ లేవని, తనకు అభిమాన సంఘాలు కూడా లేవని అన్నారు.

 చిరంజీవిపై పెట్టిన పోస్టింగ్ లను ఖండిస్తున్నానని, ఈ మొత్తం పోస్టింగ్ ల వెనుక తెలుగుదేశం పార్టీ నాయకుల కుట్ర దాగుందని ఆరోపించారు. తాను తుడా (తిరుపతి అర్బన్ డెవలప్ మెంట్ ఆథారిటీ) చైర్మన్ గా ఉన్న సమయంలో చిరంజీవి ఎమ్మెల్యేగా పని చేశారని, అప్పటి నుంచి ఆయనతో సత్సంబంధాలే ఉన్నాయని చెవిరెడ్డి వెల్లడించారు. తన ఫ్యాన్స్ అసోసియేషన్ పేరిట సోషల్ మీడియాలో ప్రచారమవుతున్న పోస్టింగ్స్ ను తక్షణం తొలగించాలని పోలీసులను కోరినట్టు తెలిపారు.
Go Back to Shorts
Chiranjeevi
Chevireddy
Twitter
Facebook

More Telugu News