తెలంగాణలో నిషేధిత మావోయిస్టు సంస్థలతో విద్యార్థులు కలుస్తున్నారు: సీపీ అంజనీకుమార్
Add ap7am to your home Screen

తెలంగాణలో నిషేధిత మావోయిస్టు సంస్థలతో విద్యార్థులు కలుస్తున్నారు: సీపీ అంజనీకుమార్

  • రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోంది
  • టీవీవీ అధ్యక్షుడి ఇంట్లో సోదాలు నిర్వహించాం
  • పలు పత్రాలు,డీవీడీలు, సీడీలు స్వాధీనం చేసుకున్నాం
తెలంగాణ రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు కుట్ర జరుగుతోందని, నిషేధిత మావోయిస్టు సంస్థలతో విద్యార్థులు కలుస్తున్నారని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, విద్యార్థులను మావోయిస్టులుగా మార్చే యత్నం జరగుతోందని చెప్పారు.

తెలంగాణ విద్యార్థి వేదిక, ప్రజాఫ్రంట్, డెమోక్రాటిక్ ఫ్రంట్ లు విద్యార్థులను మావోయిస్టులుగా మారుస్తున్నాయని అన్నారు. తెలంగాణ విద్యార్థి వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటి ఇంట్లో సోదాలు నిర్వహించామని, పలు పత్రాలు, మెమురీ కార్డులు, డీవీడీలు, సీడీలు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. టీవీవీకి చెందిన మద్దిలేటి, అనుదీప్, భరత్, సందీప్, కిషోర్ లపై వరంగల్, కొత్తగూడెం, గద్వాల్, కాజీపేట్ ప్రాంతాల్లో పలు కేసులు ఉన్నాయని అన్నారు.  
Telangana
Maoist
Hyderabad
Cp
Anjani kumar

More Telugu News