ఇథియోపియా ప్రధానికి ప్రపంచంలోనే అత్యున్నత నోబెల్ శాంతి పురస్కారం
- అబీ అహ్మద్ కు నోబెల్ పీస్ ప్రైజ్ ను ప్రకటించిన జ్యూరీ
- ఎరిత్రియాతో స్నేహం, శాంతిని నెలకొల్పిన అబీ
- డిసెంబర్ 10న పురస్కారం ప్రదానం
సరిహద్దుకు సంబంధించి ఎరిత్రియా-ఇథియోపియాకు మధ్య 1998 నుంచి 2000 వరకు యుద్ధం జరిగింది. గత ఏడాది జూలైలో మళ్లీ ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలు నెలకొన్నాయి. ఇరు దేశాల మధ్య స్నేహ సంబంధాలను పెంపొందించడానికి అబీ చాలా కృషి చేశారు. నోబెల్ పురస్కారం కింద అబీ అహ్మద్ కు 9 లక్షల అమెరికా డాలర్ల నగదు బహుమతి అందుతుంది. స్వీడన్ లోని ఓస్లోలో డిసెంబర్ 10న ఆయనకు శాంతి పురస్కారాన్ని అందజేయనున్నారు.