చిరంజీవి, రామ్ చరణ్ లను ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్

తెలుగు గడ్డపై జన్మించి బ్రిటీష్ వారితో ప్రాణాలకు తెగించి పోరాడిన తొలితరం స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ చిరంజీవి నటించిన ఈ సినిమా అక్టోబరు 2న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రత్యేకంగా చిరంజీవి, రామ్ చరణ్ లను ఇంటర్వ్యూ చేశారు. త్వరలోనే ఈ ఇంటర్వ్యూ పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి. అయితే, త్రివిక్రమ్ ఇంటర్వ్యూ రికార్డింగ్ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి. దీనికి సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రొడక్షన్స్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
Go Back to Shorts
Syeraa
Sye Raa Narasimha Reddy
Chiranjeevi
Ramcharan
Trivikram Srinivas
Tollywood

More Telugu News