ఆర్టీసీపై కుట్ర జరుగుతోంది: భట్టి విక్రమార్క
- కేసీఆర్ అహంభావానికి ఇది పరాకాష్ఠ
- ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదు
- మేం కార్మికులవైపే నిలబడతాం
ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదని, డీజిల్పై రాష్ట్రప్రభుత్వం వేసే అధిక పన్నులే కారణమని పేర్కొన్నారు. చూస్తుంటే ఆర్టీసీని హస్తగతం చేసుకునేందుకు కేసీఆర్ చేస్తున్న కుట్రగా ఇది కనబడుతోందని భట్టి విక్రమార్క ఆరోపించారు. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీ విషయంలో తమ పార్టీ కార్మికుల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు.