ఆర్టీసీ సమ్మెపై ఈ రాత్రికి తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం వెలువడే అవకాశం?
Add ap7am to your home Screen

ఆర్టీసీ సమ్మెపై ఈ రాత్రికి తెలంగాణ ప్రభుత్వ కీలక నిర్ణయం వెలువడే అవకాశం?

  • ఈ అర్ధరాత్రి నుంచి తెలంగాణ ఆర్టీసీ సమ్మె
  • ఐఏఎస్ కమిటీతో చర్చలు విఫలం
  • సీఎం కేసీఆర్ ను కలవనున్న కమిటీ
తెలంగాణ ఆర్టీసీ ఈ అర్థరాత్రి నుంచి సమ్మె బాట పడుతున్న నేపథ్యంలో సర్కారు ఆగమేఘాలపై స్పందించింది. ఆర్టీసీ కార్మికులతో చర్చల కోసం నియమించిన త్రిసభ్య కమిటీ కాసేపట్లో సీఎం కేసీఆర్ ను కలిసి పరిస్థితిని వివరించనుంది. ఆర్టీసీ కార్మికుల డిమాండ్లను కేసీఆర్ కు నివేదించనుంది. అటు, అందుబాటులో ఉన్న మంత్రులు ప్రగతి భవన్ కు రావాలని సీఎంవో నుంచి ఫోన్ కాల్స్ వెళ్లాయి. అన్ని కోణాల నుంచి చర్చించి ఈ రాత్రికి ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. కాగా, ఏపీ బాటలోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్నది టీఎస్ఆర్టీసీ కార్మికుల ప్రధాన డిమాండ్ గా తెలుస్తోంది.
TSRTC
Telangana

More Telugu News