సీఎం ఏలూరు పర్యటన: ప్రభుత్వ వైద్య కళాశాల భవనాల నిర్మాణానికి శంకుస్థాపన
- రూ.266 కోట్ల వ్యయంతో నిర్మాణాలు
- అనంతరం వాహన మిత్ర పథకానికి శ్రీకారం
- ఎగ్జిబిషన్ మైదానం సభలో ప్రసంగించనున్న ముఖ్యమంత్రి
ఈ కార్యక్రమం అనంతరం స్థానిక ఎగ్జిబిషన్ మైదానంలో జరిగిన మరో కార్యక్రమంలో ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెడుతున్న ‘వాహన మిత్ర’ పథకానికి ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. అక్కడ లబ్ధిదారులతో మాట్లాడి వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లు ఇచ్చిన ఖాకీచొక్కాను జగన్ ధరించి వారికి ఆనందం మిగిల్చారు. ఈ సందర్భంగా అబ్ధిదారులు జగన్ కు దుశ్శాలువ కప్పి గజమాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు.