'గోపాల్ దాస్ వర్మచంద్ రాంధి'... గాంధీ జయంతి సందర్భంగా తన పేరుకు పారడీ చేసిన వర్మ
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'గోపాల్ దాస్ వర్మచంద్ రాంధి'... గాంధీ జయంతి సందర్భంగా తన పేరుకు పారడీ చేసిన వర్మ

  • వర్మను స్త్రీ పక్షపాతిగా పేర్కొన్న అభిమాని  
  • స్త్రీల కోసం పోరాడుతున్నది వర్మ మాత్రమే అంటూ ట్వీట్  
  • వెరైటీగా స్పందించిన వర్మ
ట్విట్టర్ లో చిత్రవిచిత్రమైన వ్యాఖ్యలు చేయడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దిట్ట. తాజాగా ఓ అభిమాని రామ్ గోపాల్ వర్మను ఫెమినిస్టుగా పేర్కొన్నాడు. స్త్రీల బానిసత్వాన్ని తొలగించడానికి, వాళ్ల విలువల కోసం నిరంతర కృషి చేస్తున్నది ఒక్క రామ్ గోపాల్ వర్మ మాత్రమే అంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు, గాంధీ ఫొటోను వర్మ ముఖంతో మార్ఫింగ్ చేశాడు. ఈ పోస్టు వర్మను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. అందుకే గాంధీ జయంతిని పురస్కరించుకుని గాంధీ పూర్తి పేరుతో తన పేరును పారడీ చేశాడు. గోపాల్ దాస్ వర్మచంద్ రాంధి అంటూ ట్వీట్ చేశాడు. మహాత్మాగాంధీ పూర్తిపేరు మోహన్ దాస్ కరమ్ చంద్ గాంధీ అని తెలిసిందే.
RGV
Tollywood
Gandhi

More Telugu News