మస్కట్ ఎయిర్ పోర్టులో అలా భయపెట్టేశారు: హీరో వినీత్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

మస్కట్ ఎయిర్ పోర్టులో అలా భయపెట్టేశారు: హీరో వినీత్

  • అప్పట్లో నా హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా వుండేది
  • కష్టమ్స్ అధికారులు నన్ను అనుమానించారు 
  • అవి డ్రగ్స్ అనుకుని చెక్ చేశారన్న వినీత్  
తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యక్రమంలో వినీత్ మాట్లాడుతూ, తనకి ఎదురైన ఒక చేదు అనుభవాన్ని గురించి ప్రస్తావించాడు. ఒకసారి నేను మస్కట్ ఎయిర్ పోర్టుకి చేరుకున్నాను. అప్పుడు నా హెయిర్ స్టైల్ డిఫరెంట్ గా ఉండేది. నేను వేసుకున్న డ్రెస్ కూడా వెరైటీగా వుంది. అప్పుడున్న పని వలన కాస్త హడావిడిగా వున్నాను. అది గమనించిన కస్టమ్స్ అధికారులు, నన్ను అనుమానంగా చూశారు.

'మీరు కాస్త పక్కకి రండి చెక్ చేయాలి' అన్నారు. నాతోనే నా బ్యాగ్ ఓపెన్ చేయించారు. బ్యాగులో హారతి కర్పూరం పాకెట్లు .. విభూతి ప్యాకెట్లు వున్నాయి. అవి డ్రగ్స్ పాకెట్లుగా వాళ్లు అనుమానించారు. కర్పూరం బిళ్లలు నలిపి వాసన చూశారు .. అలాగే విభూతిని కూడా టెస్టు చేశారు. వాళ్ల ధోరణి నన్ను కంగారు పెట్టేసింది. నేను అలాగే చూస్తుండిపోయాను. మొత్తానికి అన్ని పరీక్షలు పూర్తిచేసి, అవి డ్రగ్స్ కాదని నిర్ధారించుకున్న తరువాత నన్ను వదిలేశారు" అని చెప్పుకొచ్చాడు.
Vineeth
Ali

More Telugu News