ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెరిగిన మద్యం ధరలు.. నేటి నుంచే అమలు

01-10-2019 Tue 06:37 | Andhra
  • కనిష్టంగా పది రూపాయల పెంపు
  • గరిష్టంగా రూ.250
  • ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే అమ్మకాలు
ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్ జగన్ ప్రభుత్వం మందుబాబులకు షాకిచ్చింది. స్వదేశీ, విదేశీ మద్యం సీసాలపై కనిష్టంగా పది రూపాయల నుంచి గరిష్టంగా రూ.250 వరకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. రెడీ టు డ్రింక్ పేరుతో విక్రయించే 250/275 ఎంఎల్ మద్యం సీసాలపై రూ.20 పెంచింది. పెరిగిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం..స్వదేశీ, విదేశీ మద్యం క్వార్టర్ సీసాపై రూ.20, హాఫ్ బాటిల్‌పై రూ.40, ఫుల్ బాటిల్‌పై రూ.80 పెరిగింది. స్వదేశీ మద్యం 60/90 ఎంఎల్ బాటిళ్లపై రూ.10, లీటరు మద్యం సీసాపై రూ.100, రెండు లీటర్ల బాటిల్‌పై రూ.250 పెంచారు. విదేశీ మద్యం 50/60 ఎంఎల్ సీసాలపై రూ.10, లీటరున్నర-రెండు లీటర్లు కలిగిన మద్యం బాటిళ్లపై రూ.250 పెరిగింది. ఇక, 330/500 ఎంఎల్ బీర్ సీసాలపై రూ.10, 650 ఎంఎల్ బీరు సీసాలపై రూ.20 పెరిగింది.

అలాగే, స్వదేశీ, విదేశీ మద్యంపై 6 శాతం రిటైల్ ఎక్సైజ్ పన్ను విధించింది.  నేటి నుంచి మద్యం దుకాణాలు నిర్వహించనున్న ఏపీబీసీఎల్‌కు అమ్మకాల్లో 4 శాతాన్ని కమిషన్‌గా చెల్లించాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దుకాణాల అద్దె, సిబ్బంది వేతనాలు చెల్లించేందుకు ఈ కమిషన్‌ను వినియోగించనున్నారు.

నేటి నుంచి ఏపీలో మద్యం అమ్మకాలు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకే కొనసాగనున్నాయి. నిజానికి ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాలు తెరిచి ఉంటాయని ప్రభుత్వం తొలుత ఆదేశాలు ఇచ్చింది. ఆ తర్వాత వాటిని సవరించి తాజా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 4,380 మద్యం దుకాణాలు ఉండగా, దశల వారీ మద్య నిషేధం అమల్లో భాగంగా వీటి సంఖ్యను 20 శాతం తగ్గించనున్నారు. ఇక, నేటి నుంచి ఏపీలో 3500 దుకాణాలు ఏపీబీసీఎల్ ఆధ్వర్యంలో నడవనున్నాయి.
Andhra Pradeshliquor shopsJagan

More Telugu News

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55
..more