భారత ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై ఉన్న అభిమానాన్ని ఓ మహిళ వీపుకెక్కించుకుంది. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌‌కు చెందిన ఓ యువతి తన వీపుపై మోదీ, ట్రంప్ ఫొటోలను పచ్చబొట్టు పొడిపించుకుని అభిమానాన్ని చాటుకుంది. ఆ ఫొటోలపైన ‘హౌడీ-మోదీ’ అని రాయించుకుంది.

రాష్ట్రంలో నిన్న ప్రారంభమైన నవరాత్రి ఉత్సవాలు వచ్చే నెల ఏడో తేదీ వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు, చంద్రయాన్-2 వంటి వాటిని టాటూలుగా వేయించుకుంటూ అందరినీ ఆకర్షిస్తున్నారు.