రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి చెప్పాను... కానీ వినలేదు: అమితాబ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి చెప్పాను... కానీ వినలేదు: అమితాబ్

  • సైరా ప్రమోషన్స్ తో చిరు, అమితాబ్ బిజీ
  • ముంబయి వెళ్లిన చిరంజీవి
  • మెగాస్టార్లను ఇంటర్వ్యూ చేసిన ఫర్హాన్ అక్తర్
బాలీవుడ్ అగ్రనటుడు అమితాబ్ బచ్చన్ టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవితో తన అనుబంధాన్ని వివరించారు. సైరా చిత్రంలో చిరంజీవికి గురువుగా నటించిన అమితాబ్ తన పాత్ర పట్ల ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక చిత్రం అక్టోబరు 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ ఈవెంట్లతో బిజీ అయింది.

తాజాగా, చిరంజీవి, అమితాబ్ లను ముంబయిలో నటుడు ఫర్హాన్ అక్తర్ ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా అమితాబ్ తన మిత్రుడు చిరంజీవి గురించి చెబుతూ, రాజకీయాల్లోకి వెళ్లొద్దని చిరంజీవికి చెప్పానని, కానీ ఆయన తన మాట వినలేదని అన్నారు. తాను చిరంజీవికి ఎన్నో సలహాలు ఇచ్చినా ఆయన ఏ కొన్నింటినో పాటిస్తారు తప్ప అన్నీ పాటించరని తెలిపారు.

చాలాకాలంగా చిరుతో స్నేహం ఉందని, ఊటీలో హమ్ చిత్రం షూటింగ్ జరుగుతున్న సమయంలో అక్కడే చిరంజీవి కూడా సెట్స్ మీద ఉన్నారని వెల్లడించారు. అప్పటికే చిరంజీవి గురించి చాలా విన్నానని, షూటింగ్ దగ్గర్లోనే జరుగుతుండడంతో వెళ్లి కలిశానని తెలిపారు. అక్కడ్నించి తమ స్నేహం మొదలైందని తెలిపారు.
Syeraa
Chiranjeevi
Amitabh Bachchan
Tollywood
Bollywood

More Telugu News