చెన్నై లో ఆఫీస్ బాయ్ గా పనిచేశాను: 'జబర్దస్త్' రైజింగ్ రాజు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

చెన్నై లో ఆఫీస్ బాయ్ గా పనిచేశాను: 'జబర్దస్త్' రైజింగ్ రాజు

  • చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండేది 
  • షూటింగులు జరిగేచోటికి వెళ్లేవాడిని
  • చెన్నైలో వేజెళ్లతో పరిచయమైందన్న రాజు
'జబర్దస్త్' కార్యక్రమం ద్వారా బాగా పాప్యులర్ అయిన కమెడియన్స్ లో రైజింగ్ రాజు ఒకరు. వైవిధ్యభరితమైన డైలాగ్ డెలివరీతో .. బాడీ లాంగ్వేజ్ తో ఆయన బుల్లితెర ప్రేక్షకులను నవ్వించేస్తుంటాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. 'మాది తూర్పు గోదావరి జిల్లా రామచంద్రపురం .. ఆరవ తరగతి తరువాత నాకు చదువబ్బలేదు. దాంతో ఓ కిరాణా కొట్లో పనిచేస్తూ, చుట్టుపక్కల జరిగే సినిమా షూటింగ్స్ చూడటానికి వెళుతూ ఉండేవాడిని.

అలాంటి పరిస్థితుల్లో మా అన్నయ్య నూతన్ ప్రసాద్ గారి దగ్గర అసిస్టెంట్ గా చేరాడు. నేను కూడా చెన్నై వెళ్లి అక్కడ ఆఫీస్ బాయ్ గా పనిచేస్తూ ఉండేవాడిని. అప్పుడు దర్శకుడు వేజెళ్ల సత్యనారాయణగారితో పరిచయం కావడంతో, ఆయన అప్పగించిన పనులు చేస్తూ ఉండేవాడిని. ఆ సమయంలోనే చిన్నా చితకా పాత్రలు వేసేవాడిని. అలా నటన విషయంలో ఆసక్తి .. అనుభవం పెరుగుతూ వచ్చాయి" అని చెప్పుకొచ్చాడు.
Raju

More Telugu News