ఈ 18 ఏళ్లలో ఎంతో మారిపోయింది కానీ...!: జూనియర్ ఎన్టీఆర్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఈ 18 ఏళ్లలో ఎంతో మారిపోయింది కానీ...!: జూనియర్ ఎన్టీఆర్

  • ఆర్ఆర్ఆర్ షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్
  • రామోజీ ఫిలింసిటీలో షూటింగ్
  • స్టూడెంట్ నెం. జ్ఞాపకాలను నెమరువేసుకున్న ఎన్టీఆర్
  • రాజమౌళి గురించి ట్వీట్ లో ప్రస్తావన
టాలీవుడ్ అగ్రహీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' చిత్రంలో నటిస్తున్నారు. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంపై అతి భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం 'ఆర్ఆర్ఆర్' షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. 18 ఏళ్ల క్రితం 'స్టూడెంట్ నెం.1' షూటింగ్ రామోజీ ఫిలింసిటీలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు.

అయితే ఈ 18 ఏళ్లలో ఎంతో మారిపోయింది కానీ, రాజమౌళితో కలిసి పనిచేస్తున్నప్పుడు లభించే వినోదం మాత్రం మారలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా, 'స్టూడెంట్ నెం.1' చిత్రంలో ఫుట్ పాత్ పై పడిపోయిన హీరోయిన్ కు తాను చేయందిస్తున్న ఫొటోను కూడా ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అదే సీన్ ను ఇప్పుడు రాజమౌళితో రిపీట్ చేస్తున్న దృశ్యాన్ని కూడా ఆ ఫొటోలో చూడొచ్చు.
Jr Ntr
Rajamouli
Tollywood
RRR

More Telugu News