కొరటాల సినిమా కోసం రంగంలోకి దేవిశ్రీ ప్రసాద్?
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొరటాల సినిమా కోసం రంగంలోకి దేవిశ్రీ ప్రసాద్?

  • విడుదలకి ముస్తాబవుతోన్న 'సైరా'
  • తదుపరి సినిమా కొరటాలతో 
  • కథానాయికగా తెరపైకి కాజల్ పేరు
ఇప్పుడు మెగా అభిమానులందరి దృష్టి 'సైరా' సినిమాపైనే వుంది. వచ్చేనెల 2వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత కొరటాలతో కలిసి చిరంజీవి సెట్స్ పైకి వెళ్లనున్నారు. అందుకు సంబంధించిన సన్నాహాలను పూర్తిచేసుకుని కొరటాల సిద్ధంగా వున్నారు. 'సైరా' సినిమాకి సంగీతాన్ని అందించిన 'అమిత్ త్రివేది'నే సంగీత దర్శకుడిగా కొరటాల ఎంపిక చేసుకున్నట్టుగా ఇటీవల వార్తలు వచ్చాయి. అయితే, అందులో నిజం లేదనేది తాజా సమాచారం.

 కొరటాల తన  సినిమా కోసం దేవిశ్రీప్రసాద్ ను ఖరారు చేసుకున్నాడని అంటున్నారు. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'శ్రీమంతుడు' .. 'జనతా గ్యారేజ్' .. 'భరత్ అనే నేను' సినిమాలు భారీ విజయాలను అందుకున్న సంగతి తెలిసిందే. కొరటాల సినిమాలో చిరంజీవి ద్విపాత్రాభినయం చేయనుండగా, ఒక కథానాయికగా కాజల్ ఎంపిక జరిగిపోయిందనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.
Chiranjeevi
Kajal

More Telugu News