Rasi Khanna: రాశిఖన్నా ఆశలన్నీ ఈ సినిమాలపైనే
తెలుగు తెరకి పరిచయమైన అందమైన కథానాయికలలో రాశిఖన్నా ఒకరు. మొదటి నుంచి కూడా ఆమె నిదానమే ప్రధానం అన్నట్టుగా ఒక్కో సినిమా చేసుకుంటూ వచ్చింది. ఆ తీరు ఒకానొక సమయంలో ఆమె రేసులో వెనకబడిపోయే పరిస్థితిని తీసుకొచ్చింది. అలాంటి సమయంలోనే రాశిఖన్నా మేలుకొంది. తెలుగుతో పాటు తమిళంలోను అవకాశాలను అందుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
ఫలితంగా తెలుగులో రెండు .. తమిళంలో రెండు సినిమాలు ఆమెకి దక్కాయి. తేజు సరసన నాయికగా 'ప్రతిరోజూ పండగే' .. విజయ్ దేవరకొండ జోడీగా 'వరల్డ్ ఫేమస్ లవర్' సినిమాలు చేస్తోంది, ఇక తమిళంలో విజయ్ సేతుపతి సరసన 'తంగా తమిజన్'ను పూర్తిచేసిన ఆమె, 'సైతాన్ కా బచ్చా'ను పూర్తి చేసే పనిలో వుంది. ఈ నాలుగు ప్రాజెక్టులపైనే ఆమె ఆశలన్నీ పెట్టుకుంది. ఆమె ఆశలను ఈ సినిమాలు ఎంతవరకూ నెరవేర్చుతాయో చూడాలి మరి.