టీమిండియాకు ఎదురుదెబ్బ... సఫారీలతో టెస్టు సిరీస్ నుంచి బుమ్రా అవుట్

  • దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ కు బుమ్రా దూరం
  • గాయంతో బాధపడుతున్న బుమ్రా
  • బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్ రాక
గతకొంతకాలంగా అన్ని ఫార్మాట్లలో టీమిండియాకు ప్రధానబలంగా మారిన యువ స్పీడ్ స్టర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడ్డాడు. దక్షిణాఫ్రికాతో జరగనున్న మూడు టెస్టుల సిరీస్ కు బుమ్రా దూరమయ్యాడు. బుమ్రా వీపు కింది భాగంలో ఎముకకు స్వల్ప పగులు ఉన్నట్టు వైద్యపరీక్షల్లో గుర్తించారు. గాయం మరీ తీవ్రతరం కాకుండా ఉండేందుకు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్ నుంచి బుమ్రాకు విశ్రాంతి కల్పించారు. బుమ్రా స్థానాన్ని ఉమేశ్ యాదవ్ తో భర్తీ చేయనున్నారు. ఇటీవలే వెస్టిండీస్ పర్యటనలో బుమ్రా అమోఘమైన రీతిలో వికెట్ల వేట సాగించాడు. ఇప్పుడు ప్రధాన బౌలర్ లేకుండానే బరిలో దిగనుండడం భారత విజయావకాశాలపై ప్రభావం చూపొచ్చని క్రికెట్ పండితులు అంటున్నారు.
Go Back to Shorts
Bumrah
India
South Africa

More Telugu News