తెలుగులో విలన్ పాత్రలు చేయకపోవడానికి కారణం అదే: సీనియర్ హీరో సుమన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలుగులో విలన్ పాత్రలు చేయకపోవడానికి కారణం అదే: సీనియర్ హీరో సుమన్

  • 'శివాజీ'లో విలన్ గా చేశాను 
  • తమిళంలో విలన్ గా బిజీ అయ్యాను 
  • తెలుగు నుంచి పవర్ ఫుల్ రోల్స్ రాలేదన్న సుమన్  
తెలుగులో యాక్షన్ హీరోగా ఒక వెలుగు వెలిగినవారి జాబితాలో సుమన్ కూడా కనిపిస్తారు. ఎన్నో విజయవంతమైన చిత్రాలు ఆయన ఖాతాలో కనిపిస్తాయి. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ .. "తమిళంలో 'శివాజీ' సినిమాలో నేను విలన్ గా చేశాను. శంకర్ - రజనీ కాంబినేషన్లోని సినిమా కావడంతో విలన్ గా చేసేందుకు అంగీకరించాను. ఆ సినిమాలో నేను చేసిన పాత్రకి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది.

దాంతో తమిళంలో అదే తరహా పాత్రలు వరుసగా వచ్చాయి. స్టార్ హీరోలైన విజయ్ .. అజిత్ .. ధనుశ్ చిత్రాలలో ప్రతినాయకుడి పాత్రలు చేశాను. అలా అదే ఊపును కంటిన్యూ చేస్తూ తమిళంలో బిజీ అయ్యాను. 'శివాజీ' ప్రభావం కారణంగా తెలుగు నుంచి కూడా నాకు అవకాశాలు వచ్చాయి. అయితే తమిళంలో బిజీగా ఉండటం వలన, 'శివాజీ'లో విలన్ పాత్ర స్థాయికి తగిన పాత్రలు రాకపోవడం వలన చేయలేకపోయాను" అని చెప్పుకొచ్చారు.
Suman

More Telugu News