'భలే భలే మగాడివోయ్' నేను చేసుంటే బాగుండేదనిపించింది: 'అల్లరి' నరేశ్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

'భలే భలే మగాడివోయ్' నేను చేసుంటే బాగుండేదనిపించింది: 'అల్లరి' నరేశ్

  • 50 సినిమాలను పూర్తి చేసిన 'అల్లరి' నరేశ్ 
  • హాస్యకథానాయకుడిగా ప్రత్యేకమైన ముద్ర 
  • మారుతి చెప్పింది వేరే కథన్న నరేశ్ 
తెలుగు తెరపై హాస్యకథానాయకుడిగా 'అల్లరి' నరేశ్ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. చాలా వేగంగా 50 సినిమాలను పూర్తిచేసిన ఆయన, ఒక వైపున కథానాయకుడిగా చేస్తూనే మరో వైపున కీలకమైన పాత్రలను చేయడానికి కూడా అంగీకరిస్తున్నాడు. 'మహర్షి'లో మహేశ్ బాబు స్నేహితుడిగా చేసిన పాత్ర అటువంటిదే.

అలాంటి నరేశ్ ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ .. 'భలే భలే మగాడివోయ్' సినిమా చూసిన తరువాత ఈ సినిమా నేను చేస్తే బాగుండేదనిపించింది. ముందుగా మారుతి నాకీ కథ చెప్పాడనీ, నేను ఒప్పుకోకపోవడం వల్లనే నానీకి వెళ్లిందనే ప్రచారం జరిగింది. అందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే, మారుతి నాకు చెప్పిన కథ ఇది కాదు .. అది వేరే. ఈ సినిమాకి ముందు నన్ను మారుతి కలవడం వలన, అంతా అలా అనుకున్నారు" అని చెప్పుకొచ్చాడు.

Allari Naresh

More Telugu News