జగన్ హెలికాప్టర్ లాండింగ్ విషయంలో వివాదం!
- ఈ ఉదయం గన్నవరం బయలుదేరిన జగన్
- ల్యాండింగ్ కు అనుమతి లేదని సమాచారం
- చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీఎంఓ ఆదేశం
అసలు సమస్య ఏంటని ప్రశ్నించిన అధికారులకు, విమానాశ్రయ సిబ్బంది సరైన సమాధానం ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనపై విచారించి, చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సీఎంఓ ఆదేశాలు పంపింది. ఆ మరుక్షణమే సర్వే శాఖ డీఐ వేణుకు కలెక్టర్ నుంచి నోటీసులు వెళ్లాయి. ఈ మొత్తం ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. మరికాసేపట్లో హెలికాప్టర్ ల్యాండింగ్ కు అనుమతి లభిస్తుందని, ఆ వెంటనే జగన్ బయలుదేరుతారని సమాచారం.