తనను పెళ్లి చేసుకోవాలని కోరిన వీరాభిమానికి... కాజల్ ఇచ్చిన సమాధానం వైరల్!
- కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా ఫ్యాన్స్ తో చిట్ చాట్
- ఇంకాస్త గట్టిగా ప్రయత్నించాలని కాజల్ సలహా
- అదేమంత సులభమైన విషయం కాదని రిటార్డ్
పలువురి ప్రశ్నలకు సమాధానం ఇస్తూ, తనకు నచ్చిన ఆహారం, ఇష్టమైన ప్రాంతం తదితర విషయాలను పంచుకున్న కాజల్, "నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను. నన్ను వివాహం చేసుకుంటారా? మీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నా" అంటూ ఓ అభిమాని ట్వీట్ చేశాడు. దీనిపై స్పందించేందుకు కాస్తంత సమయం తీసుకున్న కాజల్, "ఇంకా గట్టిగా ప్రయత్నించండి. అయితే, ఇదేమంత సులభమైన విషయం కాదు" అని రిప్లయ్ ఇచ్చింది. కాజల్ ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.